- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DMK ఓటమి.. ఎంకే స్టాలిన్ ఎమోషనల్ ట్వీట్
తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ భావోద్వేగ ప్రకటన చేశారు. కేవలం 3.52 శాతం ఓట్ల తేడాతో ఓటమి చెందామన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారంలో ఉంటే ప్రజల కోసం పథకాలు అమలు చేస్తామని అదే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల హక్కుల కోసం పోరాడుతామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు బలమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం రాజకీయాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు టీవీకే పార్టీకి అధికారం అప్పగించిన నేఫథ్యంలో ఇవాళ డీఎంకే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ పోస్టు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (డీఎంకే కూటమి) అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు వేసిన ప్రతి ఓటును తనపై ఉంచిన అమూల్యమైన నమ్మకంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
చూడని విజయం లేదు:
DMK పార్టీ ఆరు సార్లు అధికారంలో ఉందని మనం చూడని విజయం లేదు, ఎదుర్కోలేని ఓటమి లేదన్నారు. రాజకీయ జీవన ప్రయాణంలో మన సిద్ధాంతం ఓడిపోకుండా కాపాడుకోవడమే ముఖ్యం అని గెలుపు, ఓటమి రెండింటినీ సమానంగా స్వీకరించి తమ లక్ష్యాల దిశగా ముందుకు సాగేవారే పార్టీ సహచరులు అని అన్నారు. అందువల్ల ప్రతి ముఖ్య సమావేశంలో నేను తమిళనాడు అంతటా ఉన్న కార్యకర్తలకు వందనం చేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తానని మీరు ఈ ఉద్యమానికి వేర్లు, ప్రాణం అన్నారు. మీలో చాలామంది నన్ను ఓదార్చే సందేశాలు పంపుతున్నారని మీరే నన్ను నిర్మించినవారు. మీ బలమే నాకు బలం. మీరు ఉన్నంత వరకు నాకు ఏ ఆందోళన లేదు. మనం అందరం మన నాయకుడు కరుణానిధి పట్ల ఉన్న ప్రేమతో బంధించబడ్డ సహచరులం అని ఆ భావంతో మన ప్రయాణాన్ని కొనసాగిద్దామన్నారు.
కేవలం 3.52 శాతం ఓట్లే తేడా:
మీ ప్రతి ఓటును నేను అమూల్యమైన విశ్వాస సూచికగా భావిస్తున్నానని ఇప్పటివరకు అందిన ఓట్ల లెక్కల ప్రకారం DMK కూటమి 1 కోటి 54 లక్షల 82 వేల 782 ఓట్లు సాధించిందన్నారు. మరిన్ని స్థానాలు గెలిచిన పార్టీ (టీవీకే) మనకంటే కేవలం 17.43 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా పొందిందని మన మధ్య ఓట్ల శాతం తేడా కేవలం 3.52 శాతం మాత్రమేనన్నారు. నా దృష్టిలో, తమిళనాడు ప్రజలు మనపై ఉంచిన విశ్వాసం ఎంతో బలంగా ఉందని అందు వల్ల మనకు ఓటు వేసిన ప్రజల వద్దకు నేరుగా వెళ్లి కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యతగా ఎప్పుడూ భావించామన్నారు. అందువల్ల DMK బరిలో నిలిచిన అభ్యర్థులందరూ వెంటనే తమకు ఓటు వేసిన ప్రజలను కలుసుకుని వారికి కృతజ్ఞతలు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రజాజీవితంలో ప్రజలే అత్యంత గౌరవానికి పాత్రులని వారి కోసమే మన పార్టీ, మన రాజకీయాలు న్నారు. అందుకే ప్రతి అభ్యర్థి వ్యక్తిగతంగా వెళ్లి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలని కోరారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి చూపిన బాటలో ద్రావిడ సిద్ధాంతాన్ని, భాషను, జాతిని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో తమ కూటమి ఎమ్మెల్యేలు టీవీకే విజయం శిబిరంలోకి జంప్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ముందరి కాళ్ల బంధం వేయడంలో భాగంగా ఈ ట్వీట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.






