- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు సీఎం స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు కన్నుమూత!
తమిళనాడు సీఎం స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్న ముత్తు శనివారం తుదిశ్వాస విడిచారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి తనయుడు, సీఎం స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు శనివారం నాడు కన్నుమూశారు. 77 ఏళ్ల ఆయన చెన్నయ్‌లోని ఇంజంబాకంలో ఉన్న తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. కరుణానిధి మొదటి భార్య పద్మావతికి ముత్తు జన్మించారు. ఆయన పుట్టిన కొన్ని రోజులకే అనారోగ్యంతో ఆమె మరణించారు. తమిళ సినీరంగంలో నటుడిగా, గాయకుడిగా ముత్తు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఆశించిన సక్సెస్ దక్కకపోవడంతో ఆ రంగానికి దూరమయ్యారు. ముత్తు మరణవార్త విన్న ఆయన సోదరి కనిమొళి, సీఎం స్టాలిన్, ఉదయనిధి హుటాహుటిన ఇంజంబాకం చేరుకున్నారు. అనంతరం శనివారం సాయంత్రం ముత్తు అంత్యక్రియలు నిర్వహించారు. సోదరుడు చనిపోయిన వార్త తనను కలచివేస్తోందని స్టాలిన్ చెప్పారు.
Next Story






