- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థాకరే సోదరుల కలయికను స్వాగతించిన స్టాలిన్
థాకరే సోదరుల కలయికను తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. హిందీపై పోరాటం బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా సునామీలా విజృంభిస్తోందన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో థాకరే బ్రదర్స్ ఏకం అవడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతోషం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న మూడు భాషల విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీఎంకే చీఫ్.. మహారాష్ట్రలో హిందీ రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ థాకరే సోదరులు చేతులు కలపడాన్ని స్వాగతించారు.
‘హిందీ ఇంపోజిషన్‌పై తరతరాలుగా డీఎంకే, తమిళ ప్రజలు చేస్తున్న పోరాటం.. ఇప్పుడు రాష్ట్ర హద్దులు దాటి మహారాష్ట్రలో కూడా తుఫానులా మారింది. తమిళనాడు స్కూల్స్‌లో హిందీ నేర్పితేనే నిధులు ఇస్తామంటూ వినాశకారిలా ప్రవర్తిస్తున్న బీజేపీకి.. వాళ్లు అధికారంలో ఉన్న మహారాష్ట్రలో కూడా ఎదురుదెబ్బ తగిలింది’ అని తన ఎక్స్ ఖాతాలో స్టాలిన్ పేర్కొన్నారు. హిందీ రుద్దడంపై రాజ్ థాకరే లేవనెత్తిన ప్రశ్నలను సమర్థించిన స్టాలిన్.. ఆ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీశారు.






