టీవీకే ప్రభుత్వం కూలిపోతుంది.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

త‌మిళ‌నాడు మాజీ సీఎం, డీఎంకే అధ్య‌క్షుడు స్టాలిన్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే ప్ర‌భుత్వం ఐదేళ్ల‌పాటు ప‌ద‌వీకాలం పూర్తిచేయ‌లేద‌ని, అది డీఎంకే ద‌యాదాక్షిణ్యాల‌పై న‌డుస్తోంద‌ని అన్నారు.

టీవీకే ప్రభుత్వం కూలిపోతుంది.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు మాజీ సీఎం, డీఎంకే అధ్య‌క్షుడు స్టాలిన్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే ప్ర‌భుత్వం ఐదేళ్ల‌పాటు ప‌ద‌వీకాలం పూర్తిచేయ‌లేద‌ని, అది డీఎంకే ద‌యాదాక్షిణ్యాల‌పై న‌డుస్తోంద‌ని అన్నారు. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాన్ని ఓ రాజ‌కీయ ప్ర‌భంజ‌నంలా కాకుండా సినిమా సునామీలా అభివ‌ర్ణించారు. ఓట‌ర్లు రాజ‌కీయ విశ్వాసంతో కాకుండా ఓ ప్ర‌ముఖ న‌టుడిపై ఉన్న ఉత్సాహంతోనే విజ‌య్ కి మ‌ద్ద‌తు తెలిపార‌ని అన్నారు. త‌మ అభిమాన నటుడు పార్టీ పెట్టాడ‌నే ఉత్సాహంతో మాత్రమే ఓట్లు వేశార‌న్నారు. కొద్దిరోజుల్లోనే ఆ ఆట‌వ‌స్తువుపై ఆస‌క్తిపోతుంద‌ని చెప్పారు.

ఒక బిడ్డ త‌న త‌ల్లి కోసం వెతికిన‌ట్టు, ఓటర్లు మ‌ళ్లీ డీఎంకే కోసం వెతుకుతార‌ని చెప్పారు. టీవీకే 118 సీట్ల మెజారిటీ మార్కును దాట‌డంలో విఫ‌ల‌మైంద‌ని పేర్కొన్నారు. టీవీకే క‌నీసం మెజారిటీ కూడా సాధించ‌లేక‌పోయింద‌ని, ఈ రోజు ప్ర‌భుత్వం డీఎంకే ద‌య‌వ‌ల్లే మ‌నుగ‌డ సాధిస్తోందంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏ క్ష‌ణ‌మైనా ఆ ప్ర‌భుత్వం కూలిపోవ‌చ్చు అంటూ వ్యాఖ్యానించారు. డీఎంకేను చీల్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని, కానీ అవి విఫ‌లం అయ్యాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితి అస్థిరంగా ఉంద‌ని పేర్కొన్నారు. క‌మ్యూనిస్ట్ పార్టీ, వీసీకే పార్టీ, ఐయూఎంఎల్ మొద‌ట టీవీకేకు బ‌య‌ట నుండి మాత్ర‌మే స‌పోర్ట్ చేశాయ‌ని కానీ త‌ర‌వాత క్యాబినెట్ లో చేరాయ‌ని అన్నారు.

Next Story