చరిత్రను వక్రీకరించడం దేశానికే ప్రమాదకరం: సీఎం MK Stalin

by Dishanational1 |
చరిత్రను వక్రీకరించడం దేశానికే ప్రమాదకరం:  సీఎం MK Stalin
X

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించడం దేశానికే ప్రమాదకరమని ఎంకే స్టాలిన్ అన్నారు. కొందరు చెబుతున్న కల్పిత కథల మాయలో పడకుండా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 81వ వార్షిక సెషన్లో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం లౌకికవాదంగా ఉండవలసిన అవసరాన్ని స్టాలిన్ నొక్కి చెప్పారు. చరిత్ర చదవడం వల్ల లాభదాయకమైన కెరీర్ ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారని అన్నారు. అయితే అలా చేయడం కేవలం డిగ్రీ, జీతం పొందడం కోసం మాత్రమే కాదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చరిత్రను చదివిన వారే భవిష్యతును ఊహించి కొత్త చరిత్రను సృష్టిస్తారని చెప్పారు. అయితే కల్పిత కథలను నమ్మొద్దని అన్నారు. జ్ఞానవంతమైన సమాజం అలాంటి సిద్ధాంతాలను స్వీకరించదని చెప్పారు. దేశం ఒకప్పుడు సెక్యులర్‌గా ఉండేదని, కొందరు వ్యక్తులు తేడాలను సృష్టించారని ఆరోపించారు. శాస్త్రీయ ఆధారాలతోనే చారిత్రక ప్రత్యేకతల గురించి గర్వంగా చెప్పుకుంటున్నట్లు స్టాలిన్ అన్నారు. కీలాడి అధ్యయనాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికే తమిళ భూభాగంలో పట్టణీకరణ, అక్షరాస్యత ప్రబలంగా ఉన్నాయని తేల్చాయని చెప్పారు. చరిత్ర అంటే కేవలం రాజుల జీవితం, విజయాలు గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాదని, ప్రజల నడవడికను ప్రతిబింబించేదని పేర్కొన్నారు.

Also Read...

Delhi BJP మేయర్ అభ్యర్థిగా రేఖాగుప్తా


Next Story

Most Viewed