వాళ్లు ఇన్‌స్టాగ్రామ్ వాడి అధికారంలోకి వచ్చారు.. టీవీకేపై స్టాలిన్ విమర్శలు

by Ajay Maddhiboyina |

త‌మిళ‌నాట అధికారంలోకి వ‌చ్చిన టీవీకే పార్టీపై మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ విమ‌ర్శ‌లు కురిపించారు. తంజావూర్ లో ఓ పెళ్లికి హాజ‌రైన సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారానే టీవీకే అధికారంలోకి వచ్చింది అంటూ విమర్శించారు.

వాళ్లు ఇన్‌స్టాగ్రామ్ వాడి అధికారంలోకి వచ్చారు.. టీవీకేపై స్టాలిన్ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: త‌మిళ‌నాట అధికారంలోకి వ‌చ్చిన టీవీకే పార్టీపై మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ విమ‌ర్శ‌లు కురిపించారు. తంజావూర్ లో ఓ పెళ్లికి హాజ‌రైన సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారానే టీవీకే అధికారంలోకి వచ్చింది అంటూ విమర్శించారు. పార్టీ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లు, ఓట్ల లెక్కింపు ఏజెంట్లు లేకుండానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఆ గెలుపునకు సోషల్ మీడియానే కారణమని వ్యాఖ్యానించారు. చిన్న పిల్లలత ప్రచారాలు చేయించి వాళ్ల తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. తాము గెలుపు, ఓటమిలను సమాన దృష్టిలో పెట్టుకుని ప‌నిచేస్తామ‌ని అన్నారు.

ఓట‌మితో డీఎంకే పార్టీ ప‌నైపోయింద‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నార‌ని, కానీ త‌మ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు అనేక ఎన్నిక‌ల‌ను చూసింద‌న్నారు. డీఎంకే ఓడిన‌ప్పుడే ఫీనిక్స్ ప‌క్షిలా పుంజుకుంటుంద‌ని చెప్పారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల కోసం పథకాలు అందించామన్నారు. తమ పథకాలు అమలులో ఉన్నంతకాలం రాష్ట్రంలో ద్రవిడ మోడల్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. ఓడిపోయినందుకు తాము చింతించడంలేదని ఓటమికి కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట టీవీకే విజయం సాధించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే డీఎంకేను ఓడిస్తూ టీవీకే విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Next Story