IAF: జూన్ లో నాసిక్ నుంచి ‘Mk-1A’ యుద్ధ విమానం?

by Shamantha N |

భారత వాయుసేన (IAF) చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఇటీవల దేశీయ రక్షణ ప్రాజెక్టుల్లో అనుకున్న సమయానికి ఒక్క యుద్ధ విమానం కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తమ నాసిక్ తయారీ కేంద్రం నుంచి తేజస్ Mk-1A యుద్ధ విమానాన్ని జూన్ లో భారత వాయుసేనకు అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

IAF: జూన్ లో నాసిక్ నుంచి  ‘Mk-1A’ యుద్ధ విమానం?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వాయుసేన (IAF) చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఇటీవల దేశీయ రక్షణ ప్రాజెక్టుల్లో అనుకున్న సమయానికి ఒక్క యుద్ధ విమానం కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తమ నాసిక్ తయారీ కేంద్రం నుంచి తేజస్ Mk-1A యుద్ధ విమానాన్ని జూన్ లో భారత వాయుసేనకు అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. HAL మూడవ తేజస్ ఉత్పత్తి కేంద్రం నాసిక్ లో ఉంది. ఇప్పటికే బెంగళూరులో రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. నాసిక్ కేంద్రం ప్రారంభం కావడం వల్ల ఆలస్యం అవుతున్న తేజస్ ప్రోగ్రాంను వేగవంతం చేయడానికి కీలకంగా నిలుస్తుంది. అమెరికాకు చెందిన GE Aerospace సంస్థ సరఫరా చేయాల్సిన F404 ఇంజిన్ల ఆలస్యం కారణంగా తేజస్ Mk-1A ప్రాజెక్టు వెనకబడింది. 2021 ఫిబ్రవరిలో రూ. 48,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, మొదటి విమానం 2024 మార్చి 31న అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదు

స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో కీలక మైలురాయి

ఇటీవల సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఎయిర్ మార్షల్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒక సారి గడుపు చెప్పిన తర్వాత ఒక్క ప్రాజెక్టును కూడా సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు. పూర్తవుతుందన్న నమ్మక్మం లేదన్నారు. ఇది మనం తప్పక గమనించాల్సిన విషయం అన్నారు. సాధ్యం కాని విషయాలపై ఒప్పందాలు చేసుకుని హామీలు ఎందుకు ఇస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. తేజస్ Mk-1A ఆలస్యం అంశంపై HAL అధికారులను ఆయన బహిరంగంగానే విమర్శించారు.ప్రస్తుతం బెంగళూరు నాసిక్ కేంద్రాలు ఒక్కో సంవత్సరం 8 విమానాల వరకు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ ఉత్పత్తి ఇంజిన్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. స్వదేశీ యుద్ధ విమానాల తయారీ ప్రోగ్రాంలో కీలక మైలురాయిగా నిలుస్తుంది. మారుతున్న యుద్ధ పద్ధతులు, డ్రోన్‌లు, ఏఐ ఆధారిత టెక్నాలజీ నేపథ్యంలో వాయుసేన చీఫ్ తక్షణమే ఆధునిక టెక్నాలజీలను సాయుధదళాల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. HAL తదితర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలతో మరింతగా భాగస్వామ్యం పెంచుకుని ఉత్పత్తి వేగం పెంచాలని సూచించారు.

Next Story