- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bareilly: టీలో ఎలుకల మందు కలిపి.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఉత్తరప్రదేశ్ మీరట్ హత్యోదంతం మర్చిపోకముందే.. బరేలీలో అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ మీరట్ హత్యోదంతం మర్చిపోకముందే.. బరేలీలో అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తను గొంతుపిసికి చంపింది. డెడ్ హాడీని సీలింగ్ కు దీసి ఆత్మహత్య చేసుకున్నట్లు న్మమింది. . పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం తెలియడంతో మహిళ, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫతేగంజ్‌లో నివసిస్తున్న కేహర్ సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య రేఖతో 16 ఏళ్ల కిందట అతడికి వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలున్నారు. కాగా, రేఖకు పింటూ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కేహర్ సింగ్‌కు ఇది తెలియడంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేసేందుకు రేఖ ప్లాన్ వేసింది. ఏప్రిల్ 13న ఆదివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడిని తన ఇంటికి పిలిచింది. వారిద్దరూ కలిసి గొంతు పిసికి కేహర్ సింగ్‌ను హత్య చేశారు. ఆతర్వాత అతడి మెడకు తాడు బిగించి సీలింగ్‌కు వేలాడదీశారు. సోమవారం తెల్లవారుజామున తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేఖ పెద్దగా ఏడుస్తూ పొరుగువారికి చెప్పింది. దీంతో, వారు పోలీసులకు సమాచారమిచ్చారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించగా.. గొంతుపిసికి చంపినట్లు అందులో తేలింది. దీంతో, రేఖను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రియుడితో కలిసి భర్త హత్య చేసినట్లు ఆమె అంగీరించిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






