టాటా ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేసిన మిస్త్రీ

by Naga Rani Yarlagadda |

టాటా గ్రూపులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అంతర్గత విభేదాలు ముదురుతున్నాయనేందుకు అద్దం పడుతున్నాయి.

టాటా ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేసిన మిస్త్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూపులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అంతర్గత విభేదాలు ముదురుతున్నాయనేందుకు అద్దం పడుతున్నాయి. దివంగత వ్యాపారవేత్త రతన్ టాటాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మెహ్లీ మిస్త్రీని ఈ గ్రూపుకు లైఫ్ టైమ్ ట్రస్టీగా పునర్ నియమించేందుకు టాటా ట్రస్ట్స్ ఆమోదం తెలుపలేదు. దీంతో మిస్త్రీ ఆ నిర్ణయంపై న్యాయపోరాటం మొదలుపెట్టినట్లు సమాచారం. ముంబై ఛారిటీ కమిషనల్ ఎదుట టాటా ట్రస్ట్స్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. కేవియెట్ దాఖలు చేసినట్లు పలు జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.

సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, బాయి హీరాబాయి జంషెడ్జీ టాటా నవ్సారి ఛారిటబుల్ ఇన్ స్టిట్యూషన్ కు మిస్త్రీని ట్రస్టీగా పునర్ నియమించే ప్రపొజల్ కు ట్రస్టీల అనుమతి కోరుతూ టాటా ట్రస్ట్స్ సీఈఓ ఒక సర్క్యులర్ పంపారు. దీనిపై ట్రస్టీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మిస్త్రీ పునర్ నియామకం ఆగిపోయింది.

Next Story