- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో చివరి మావోయిస్టు లొంగుబాటు
కర్ణాటకలోని కుందపుర తాలూక మచ్చట్ట గ్రామానికి చెందిన లక్ష్మీ.. 20 ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

- 20 ఏళ్లుగా అజ్జాతంలో ఉన్న లక్ష్మీ
- ఉడిపి పోలీసుల ఎదుట లొంగిపోయిన లక్ష్మీ
- మావోయిస్టు రహిత రాష్ట్రంగా కర్ణాటక : సీఎం సిద్ధ రామయ్య
దిశ, నేషనల్ బ్యూరో:
కర్ణాటకలో చివరి మావోయిస్టులో పేర్కొంటున్న లక్ష్మీ ఆదివారం కర్ణాటక పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన భర్త, సరెండర్ కమిటీ సభ్యుడైన సలీం, శ్రీపాల్, సోదరుడు విఠల్ పూజారితో కలిసి ఉడిపి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వచ్చిన లక్ష్మీ.. ఎస్పీ హెచ్‌డీ కులకర్ణి, డిప్యూటీ ఎస్పీ డీటీ ప్రభు ఎదుట లొంగిపోయారు. కర్ణాటకలోని కుందపుర తాలూక మచ్చట్ట గ్రామానికి చెందిన లక్ష్మీ.. 20 ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మావోయిస్టు అజెండాతో విక్రమ్ గౌడతో కలిసి పని చేసింది. మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేయడంతో పాటు, పోలీసులపై జరిగిన దాడుల్లో కూడా ఆమె పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయి. గతంలో ఆమెపై మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా చాన్నాళ్ల పాటు ఏపీలో తన భర్త, ఇద్దరు పిల్లలతో తలదాచుకున్న లక్ష్మీ చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
కర్ణాటకలో యాక్టీవ్‌గా ఉన్న చివరి మావోయిస్టు లక్ష్మీ లొంగుబాటుతో.. కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని సీఎం సిద్ధ రామయ్య ప్రకటించారు. రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సరెండర్ కమిటీని ఏర్పాటు చేసి.. వారి ద్వారా మధ్యవర్తిత్వం నెరిపింది. దీంతో అనేక మంది మావోయిస్టులు క్రమంగా లొంగిపోతు వచ్చారు. రెండు రోజుల క్రితం కిగ్గా గ్రామానికి చెందిన మావోయిస్టు లీడర్ రవీంద్ర నెమ్మార్ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయాడరు. కాగా, తనకు లొంగిపోయిన తర్వాత ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.






