- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Missile: అణు క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించిన రష్యా
రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అణు శక్తితో నడిచే బురెవెస్ట్‌నిక్ అనే క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అణు శక్తితో నడిచే బురెవెస్ట్‌నిక్ అనే క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 15 గంటల పాటు గాలిలోనే ఉండి 14, 000 కిలోమీటర్లు ప్రయాణించినట్టు రష్యా టాప్ జనరల్ గెరాసిమోవ్ తెలిపారు. ఇది అణుశక్తితో నడిచేదని, ఏదైనా క్షిపణి వ్యవస్థను నాశనం చేయగలదని వెల్లడించారు. రష్యా సైనిక సాంకేతికతలో దీనిని చారిత్రక పరిణామంగా పరిగణిస్తున్నారు. క్షిపణిని తుది పరీక్షలకు సిద్ధం చేయాలని గెరాసిమోవ్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. దీనిని సాయుధ దళాల్లో మోహరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెంటనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని సైన్యానికి సూచించారు.
బురెవెస్ట్‌నిక్ అనేది అత్యాధునికి క్రూయిజ్ క్షిపణి. ఇది సాంప్రదాయ క్షిపణుల కంటే భిన్నంగా ఉంటుంది. చిన్న అణు రియాక్టర్ ను కలిగి ఉండటంతో పాటు చాలా దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. నెలల తరబడి గాలిలో ఎగురుతూనే ఉంటుంది. సాధారణ మిస్సైల్స్ ఇంధనం అయిపోనప్పుడు ఆగిపోతాయి. కానీ ఈ మిస్సైల్ ఇంధన సహాయంతో పని చేస్తుంది. ఈ క్షిపణి పేరుకు రష్యన్ భాషలో తుఫాను పెట్రెల్ అని అర్థం వస్తుంది. అణు శక్తిపై ఆధారపడిన మొట్టమొదటి ఆయుధ వ్యవస్థ ఇదే కావడం గమనార్హం.






