- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajnath Singh: డ్రోన్ నుండి క్షిపణి ప్రయోగం సక్సెస్ .. సైనిక సామర్థ్యంలో భారత్ భారీ ముందడుగు
డ్రోన్ నుండి క్షిపణి ప్రయోగం సక్సెస్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: యుద్ధాల్లో మారుతున్న దాడుల తీరు నేపథ్యంలో భారత్ కీలక పురోగతి సాధించింది. డ్రోన్ నుంచి క్షిపణిని (Missile Launche) విజయవతంగా ప్రయోగించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యూఏవీ లాంచ్ డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్పీజీఎం)-వీ3 ని ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని నేషన్ల ఓపెన్ ఏరియా రేంజి లో ఇవాళ పరీక్షించారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ క్షిపణి అభివృద్ధి, తయారీలో భాగస్వాములైన డీఆర్ డీవో, ఎంఎస్ ఎంఈ, స్టార్ట్ ప్స్ ను ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఎంతటి సంక్లిష్టమైన టెక్నాలజీనైనా అర్థం చేసుకోవడంతో పాటు దాన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని ఈ పరీక్ష రుజువు చేసిందని తెలిపారు. కాగా తాజా ప్రయోగం యుద్ధభూమిలో మారుతున్న కొత్త పోకడల నేపథ్యంలో భారత్ శక్తిసామర్థ్యాలను మరింత పదును తేల్చేదిగా మారనుంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ లో మన ప్రత్యర్థి పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా ఎటాక్ చేసింది. ఆధునిక టెక్నాలజీ యుగంలో డ్రోన్లతో యుద్ధానా కొనసాగుతున్నందునా భారత్ డ్రోన్ నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం కీలక ముందడుగుగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.






