ఇరాన్ అణు ప్లాంట్‌పై క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం!

by Prasad Jukanti |

బుషెహర్ అణు ప్లాంట్‌పై క్షిపణి దాడితో ఇరాన్‌లో హైటెన్షన్ నెలకొంది. ఇక కువైట్, సౌదీలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది.

ఇరాన్ అణు ప్లాంట్‌పై క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్, అమెరికా మొదలు పెట్టిన యుద్ధంలో ఇరాన్ ప్రతీకార దాడుల్లో దూసుకెళ్తోంది. యుద్ధం ఇప్పటికే ఐదవ వారానికి చేరుకోగా ఇప్పటికే యూఎస్ కు చెందన యుద్ధవిమానాలు కూర్చిన ఇరాన్ తాజాగా సౌదీ, కువైట్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు. కువైట్ లోని చమురు శుద్ధి కర్మాగారంపై ఎటాక్ చేసింది. గత రాత్రి నుంచి రాత్రి నుంచి మధ్యప్రాచ్యం అంతటా ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల పేలుళ్లు, సైరన్లు మోగుతూనే ఉన్నాయి. కువైట్‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరగడంతో, దానిలోని కొన్ని యూనిట్లకు నిప్పంటుకుంది.

బుషెహర్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌ లక్ష్యంగా క్షిపణి దాడి:

ఇరాన్ ప్రతీకార దాడుల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న క్రమంలో నైరుతి ఇరాన్‌లోని బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రం లక్ష్యంగా శనివారం ఉదయం క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు ఇరాన్ అధికారుల నుండి అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తెలిపింది. బుషెహర్ ప్లాంట్‌లోని ఒక సిబ్బంది క్షిపణి శకలం తాకిడికి మరణించారని, ఆ ప్రదేశంలోని ఒక భవనం ప్రకంపనలు, శకలాల వల్ల ప్రభావితమైందని ఇరాన్ తమకు తెలియజేసిందని ఆ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. రేడియేషన్‌లో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదని IAEA తెలిపింది. కాగా ఈ ఘటనపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ "తీవ్ర ఆందోళన" వ్యక్తం చేశారని, అణు ప్రమాదం జరిగే ప్రమాదం ఉన్నందున అణు విద్యుత్ కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాలపై ఎన్నడూ దాడి చేయకూడదని ఆయన పేర్కొన్నారని ఆ సంస్థ తెలిపింది.

ట్రంప్ హెచ్చరికలు:

ఒకవేళ ఇరాన్ నాయకత్వం హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే వచ్చే వారంలోగా విద్యుత్, డీశాలినేషన్ ప్లాంట్లతో సహా మరిన్ని పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో బుషెహర్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌ లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపుతోంది.

Next Story