- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశ్వసుందరిగా మిస్ మెక్సికో.. ఫాతిమా బాష్ సంచలనం
థాయ్‌లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్-2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్ వేదికగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 గ్రాండ్ ఫినాలేలో 25 ఏళ్ల మిస్ మెక్సికో ఫాతిమా బాష్ (Fatima Bash) విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 121 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ మహా సమరంలో ఫాతిమా అద్భుతంగా రాణించి మెక్సికో నాలుగోసారి మిస్ యూనివర్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫాతిమా బాష్ మెక్సికోలోని తబాస్కో (Tabasco) రాష్ట్రానికి చెందిన మొదటి మహిళగా ఈ గౌరవాన్ని సాధించింది. మిస్ యూనివర్స్ ఫైనల్ రౌండ్‌లో డెన్మార్క్, నైజీరియా, థాయిలాండ్, వెనిజులాలతో పాటు టాప్-5లో నిలిచి ఈవెనింగ్ గౌన్, కశ్చన్ అండ్ ఆనర్స్ సెగ్మెంట్‌ల్లో అదరగొట్టింది. జడ్జీలు అడిగిన ఆమె చివరి ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ‘నమ్మకం, ధైర్యం, ప్రేమ ఇవే నా జీవిత స్తంభాలు’ అని చెప్పడంతో ఆమెకు విశ్వసుందరీ కిరీటం దక్కింది. ఇక తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలీ నిలిచారు. అయితే, భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ (Manika Vishwakarma) ఈ పోటీలో పాల్గొనగా ఆమె టాప్ 30లోకి వచ్చింది. కానీ, టాప్ 12లో పోటీ నుంచి ఆమె ఎలిమినేట్ అయ్యారు.






