- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్‌పై తప్పుదోవ పట్టిస్తున్నారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ప్రజలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ప్రజలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సింగపూర్ (Singapore)లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్ ఇచ్చిన ఇంటర్వ్యూపై ఇవాళ ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆపరేషన్ సిందూర్‌పై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అన్నారు. సభలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి అన్ని వాస్తవాలను వెల్లడించాలని తెలిపారు.
భారత వాయుసేన ధైర్యాన్ని, సంకల్పాన్ని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుందని.. అయితే, రక్షణ సంసిద్ధతపై సమగ్ర వ్యూహాత్మక సమీక్ష అవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, కార్గిల్ సమీక్ష కమిటీ తరహాలో స్వతంత్ర నిపుణుల కమిటీతో రక్షణ శాఖ సంసిద్ధతపై సమీక్షించాలని డిమాండ్ చేసింది. ఈ సమీక్షలో ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన సవాళ్లు, వ్యూహాత్మక నిర్ణయాలు, సాంకేతిక లోపాలను విష్లేశించాల్సిన అవసరం ఉందన్నారు. మే 10న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్వీట్ తర్వాత విదేశాంగ కార్యదర్శి ప్రకటించిన శాంతి ఒప్పందం యొక్క నిబంధనలను మోదీ వెల్లడించడం లేదని, దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య మళ్లీ హై టెన్షన్ ఏర్పడుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. శాంతి ఒప్పందం యొక్క నిబంధనలు ఏంటనే విషయం 140 కోట్ల భారతీయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.






