Haryana: గురుపౌర్ణమి రోజే ప్రిన్సిపల్ ను హత్య చేసిన మైనర్ విద్యార్థులు

by Prasad Jukanti |   (  Updated:2025-07-10 12:43:16  IST  )

తమను మందలించాడనే కోపంతో ఇద్దరు విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపాల్ ను దారుణంగా హత్య చేశారు.

Haryana: గురుపౌర్ణమి రోజే ప్రిన్సిపల్ ను హత్య చేసిన మైనర్ విద్యార్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓవైపు దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ మరో వైప ఇదే రోజున ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ను ఇద్దరు మైనర్ స్టూడెంట్స్ దారుణంగా హత్య చేశారు. తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ ఘటన హర్యానా హిస్సార్ లోని కర్తార్ మెమోరియల్ పాఠశాలలో చోటు చేసుకుంది. స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న జగ్బీర్ సింగ్ (50) ఇవాళ ఉదయం పాఠశాలలో ఇద్దరు 12వ తరగతి విద్యార్థులను హెయిర్ కట్ చేయించుకోవాలని, స్కూల్ నిబంధనలు పాటించేలేలా వస్త్రధారణ ఉండాలని సూచించారు. తీరు మార్చుకోవాలని గతంలోనూ జగ్బీర్ సింగ్ సదరు విద్యార్థులను హెచ్చరించారు. అయితే ఇవాళ మరోసారి మందలించడంతో కోపోద్రేకులైన విద్యార్థులు తమ వద్ద ఉన్న కత్తితో ప్రిన్సిపాల్ పై కత్తితో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్త్రావంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య అనంతరం సదరు విద్యార్థులిద్దరూ క్యాంపస్ వదిలి పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యారు. వెంటనే ఇతర విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ ను ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Next Story