- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైకో లవర్! బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరింపు.. తర్వాత ఏమైందంటే? మహారాష్టలో ఘటన వైరల్
తనను ప్రేమించాలని 18 ఏళ్ల యువకుడు సైకోల మారి మైనర్ బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: తనను ప్రేమించాలని 18 ఏళ్ల యువకుడు సైకోల మారి మైనర్ బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు. (Maharashtra) మహారాష్ట్రలోని సతారాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించాలని యువకుడు బాలిక వెంటపడ్డాడు. బాలిక తిరస్కరించడంతో.. బడి నుంచి వచ్చే సమయంలో అడ్డుకొని యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు చాకచక్యంగా స్పందించి ఆ యువకుడి నుంచి బాలికను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సతారా పరిధిలోని ఓ పట్టణంలో నిందితుడు ఆర్యన్ వాఘ్మలే, 14 ఏళ్ల బాలిక ఒకే కాలనీలో నివసిస్తున్నారు.
గత కొంతకాలంగా ఆ యువకుడు తనను ప్రేమించాలని బాలిక వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో బాలిక ఎక్కడ కనిపించిన యువకుడు వేధింపులకు గురిచేశాడు. బాలిక కుటుంబం వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడంతో మరింత ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం స్కూల్ ముగిశాక ఇంటికి తిరిగి వెళ్తుండగా సతారాలోని ఓ ప్రాంతంలో రోడ్డుపై అమ్మాయిని యువకుడు అడ్డగించి, తనను ప్రేమించాలని, లేదంటే చంపేస్తా అంటూ కత్తితో బెదిరించాడు.
ఇది గమనించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిటీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ వింగ్ కానిస్టేబుల్ సాగర్ నికమ్, ధీరజ్ మోరే వెంటనే రహస్యంగా ఘటన స్థలానికి చేరకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో జనాలు గుమిగూడి ఉన్నారు. బాలికను వదిలివేయాలని స్థానికులు యువకుడిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ మాటల్లో పెట్టారు. స్థానికులతో పాటు ఒక అధికారి ముందు నుంచి యువకుడిని మాటల్లో పెట్టగా.. మరొక అధికారి చాకచక్యంగా వెనుక నుంచి వెళ్లి అతని చేతిలోని కత్తిని పట్టుకోని బాలికను సురక్షితంగా రక్షించారు.
అమ్మాయిని కాపాడిన తర్వాత వెంటనే స్థానికులు గుంపుగా వచ్చి యువకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్థానికులను నెటిజన్‌లు ప్రశంసించారు. వీడియో లింక్






