బేకరీలో దారుణం.. ఐస్‌క్రీమ్ కోసం వెళ్లిన చిన్నారిని లోపలికి లాక్కెళ్లి.. దారుణానికి ఒడిగట్టిన ఓనర్..

by Sujitha Rachapalli |

బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఐస్ క్రీమ్ కోసం వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారిని లోపలికి లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు బేకరీ ఓనర్. ఎంఎస్ పాల్య సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరగ్గా..

బేకరీలో దారుణం.. ఐస్‌క్రీమ్ కోసం వెళ్లిన చిన్నారిని లోపలికి లాక్కెళ్లి.. దారుణానికి ఒడిగట్టిన ఓనర్..
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఐస్ క్రీమ్ కోసం వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారిని లోపలికి లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు బేకరీ ఓనర్. ఎంఎస్ పాల్య సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరగ్గా.. 38 ఏళ్ల బేకరీ యజమాని సతీష్‌ను అరెస్టు చేశారు పోలీసులు. సతీష్ విద్యారణ్యపురలోని సింగపూర్ విలేజ్ నివాసి. కాగా ఈ ఘటన రాత్రి 10:30 గంటల సమయంలో జరిగింది.

బాలిక తన తల్లితో కలిసి మెడికల్ స్టోర్‌కు వెళ్లినప్పుడు... ఐస్‌క్రీం కొనడానికి డబ్బు అడిగింది. తల్లి డబ్బు ఇచ్చి.. సమీపంలోని బేకరీలో కొనుక్కోమని చెప్పింది. సతీష్ ఆమెను బేకరీలోకి పిలిచి... ఒక మూలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాలిక తల్లి ఆమె పేరు పిలవడంతో బాలిక భయపడిన స్థితిలో బేకరీ నుండి పరుగెత్తుకొచ్చింది. ఏమైందని తల్లి అడగ్గా.. బాలిక సతీష్ తనను లోపలికి పిలిచి, అసభ్యకరంగా ముట్టుకున్నట్లు వెల్లడించింది. విద్యారణ్యపుర పోలీసులు మంగళవారం సాయంత్రం సతీష్‌ను అతని ఇంటి వద్ద అరెస్టు చేశారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Next Story