- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికను పగబట్టిన పాము.. నెలలో ఏకంగా ఆరుసార్లు కాటేసింది!
పగబట్టిందో లేదా యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు కానీ ఓ పాము పదిహేనేళ్ల బాలికను నెలలో ఏకంగా ఆరుసార్లు కాటేసింది. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది. భైంషాపర్ గ్రామానికి చెందిన 15ఏళ్ల రియా మౌర్యకు ఇలాంటి వింత

దిశ, వెబ్ డెస్క్ : పగబట్టిందో లేదా యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు కానీ ఓ పాము పదిహేనేళ్ల బాలికను నెలలో ఏకంగా ఆరుసార్లు కాటేసింది. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది. భైంషాపర్ గ్రామానికి చెందిన 15ఏళ్ల రియా మౌర్యకు ఇలాంటి వింత పరిస్థితి ఎదురైంది. జూలై 22న పొలానికి వెళ్తుండగా మొదటి సారి పాము కాటేయగా.. మెడికల్ కాలేజీలో చికిత్స చేయించగా కోలుకుంది. మళ్లీ ఆగస్టు 13న పాము కాటేయడంతో పాప పరిస్థితి విషమించింది. వైద్యులు ప్రయాగ్ రాజ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి 30 మధ్యలోనే నాలుగుసార్లు పాము కరిచిందని తెలిపాడు పాప తండ్రి రాజేంద్ర మౌర్య. స్నానం చేస్తున్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు. కాగా పాము చాలా పెద్దదని చెప్తున్న చిన్నారి.. ముదురు నలుపు, ఆకుపచ్చ చారలను కలిగి ఉందని చెప్పింది. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చిన ప్రయోజనం శూన్యమైపోయింది. వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు, బాధితులు ఆరోపిస్తున్నారు.






