Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

by Malleboina Mahesh |

అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలో ఆదివారం ఉదయం 05:06:33 గంటలకు భూకంపం సంభవించింది.

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని దిబాంగ్ లోయలో ఆదివారం ఉదయం 05:06:33 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రతీ రిక్టర్ స్కేలుపై 3.8 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని ఖచ్చితమైన స్థానం లాటిట్యూడ్ 29.03 N, లమర్టిచ్యూడ్ 95.78 E వద్ద ఉంది. ఈ భూకంపం తక్కువ తీవ్రత కలిగినదిగా పరిగణించబడుతుంది. కాగా ఈ స్వల్ప భూకంపం వల్ల ప్రస్తుతం ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి నివేదికలు అందుబాటులోకి రాలేదు. కానీ భూకంపం కారణంగా వచ్చిన ప్రకంపణలతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు ప్రాణభయంతో విధుల్లోకి పరుగులకు తీసినట్లు తెలుస్తోంది.

Next Story