- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minnesota: అమెరికాలో చట్టసభ సభ్యులపై కాల్పులు.. మాజీ హౌస్ స్పీకర్ మెలిస్సా దంపతుల మృతి
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు చట్టసభ సభ్యులే లక్ష్యంగా కాల్పులు జరిగాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని మిన్నెసోటా (Minnoseta) రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు చట్టసభ సభ్యులే లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇద్దరు డెమొక్రటిక్ శాసనసభ్యులపై వారి ఇండ్డలోనే దుంగడులు కాల్పులు జరిపారు. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో మిన్నెసోటా మాజీ హౌస్ స్పీకర్ మెలిస్సా హోర్ట్‌మన్ (Mellissa Hortman), ఆమె భర్త మరణించగా.. రాష్ట్ర సెనేటర్ జాన్ హాఫ్‌మన్, ఆయన భార్య య్వెట్ తీవ్రంగా గాయపడ్డారు. చాంప్లిన్, బ్రూక్లిన్ పార్క్‌లోని వారి ఇంటి వద్ద కాల్పులు జరిగినట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. మిన్నెసోటా గవర్నర్ టివ్ వాల్జ్ దీనిని ధ్రువీకరించారు. కాల్పులను పూర్తిగా ఖండించిన ఆయన ప్రజా ప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిగా అభివర్ణించారు.
దుండగుడు పోలీస్ డ్రెస్టులో ఉన్నాడని, సభ్యుల ఇళ్లలోకి ప్రవేశించడానికి సెక్యూరిటీ అధికారిగా నటించి ఉంచొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు, కానీ రాజకీయ కారణాలతోనే దాడికి పాల్పడినట్టు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది చట్టసభ సభ్యులపై జరిగిన దాడి అని యూఎస్‌లో ఇటువంటి హింసకు తావులేదని తెలిపారు.






