ట్రంప్ భారత్ పర్యటన.. సమాచారం లేదన్న విదేశాంగశాఖ

by Muthe.Rajitha |

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తారనే సమాచారం ఏదీ తమవద్ద లేదని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

ట్రంప్ భారత్ పర్యటన.. సమాచారం లేదన్న విదేశాంగశాఖ
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తారనే సమాచారం ఏదీ తమవద్ద లేదని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అణు పరీక్షలకు సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలపై రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం భారత్‌కు పూర్తిగా తెలుసునని అన్నారు. రహస్య, చట్టవిరుద్ధమైన అణు కార్యకలాపాలు పాకిస్తాన్‌ చరిత్రలోనే ఓ భాగమని ఆయన విమర్శించారు.

ఎప్పటికప్పుడు పాక్‌ అణు కార్యక్రమాల గురించి అంతర్జాతీయ సమాజానికి చెబుతూనే ఉన్నామన్నారు. అణుపరీక్షలపై రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ వంటి దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను గమనిస్తూనే ఉన్నామన్నారు. ట్రంప్‌ భారత పర్యటన తాను ఏమీ స్పందించలేనని.. చెప్పేందుకు తన వద్ద సమాచారం ఏమీ లేదన్నారు.

కాగా ఇటీవల ట్రంప్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ వంటి దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని.. అమెరికా మాత్రమే పరీక్షలను నిలిపివేసిందన్నారు. ఇతర దేశాలు అణు పరీక్షలు చేస్తే తాము కూడా చేస్తామని ప్రకటించారు.

Next Story