- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద రీతిలో మంత్రి మేనకోడలి కుటుంబం మృతి.. హత్యలా?
అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలు శ్రీలేఖ, భర్త ప్రేమరాజన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: అటవీశాఖ మంత్రి మేనకోడలి కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగుచూసింది. మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలైన ఏకే శ్రీలేఖ (68), భర్త ప్రేమరాజన్ (75)ల కాలిన మృతదేహాలు వారి ఇంటిలో లభ్యమవ్వడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రేమరాజన్ దంపతులు కన్నూరు జిల్లాలోని అలవిల్ ప్రాంతంలో ఉన్న ఇంటిలో ఉంటున్నారు. వారి పిల్లలు విదేశాలలో ఉంటున్నారు. కాగా.. గురువారం సాయంత్రం డ్రైవర్ వారికి ఇంటికి వెళ్లగా ఇద్దరూ మరణించిన స్థితిలో కనిపించారు.
విదేశాల నుంచి వస్తున్న వారి కొడుకుని ఎయిర్ పోర్టు నుంచి తీసుకొచ్చేందుకు డ్రైవర్ ఇంటికి వెళ్లాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకకపోవడంతో డ్రైవర్ ఇరుగు, పొరుగు వారిని పిలిచాడు. వారు తలుపులు పగలగొట్టి చూడగా దంపతులిద్దరూ కాలిన స్థితిలో విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల పక్కన రక్తపు మరకలతో ఉన్న సుత్తిని గమనించారు. శ్రీలేఖ తలపై బలంగా కొట్టిన గాయం ఉండటంతో వారిని తగలబెట్టడానికి ముందే హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా నిర్థారించారు. కాగా.. ఆగస్టు 27 తర్వాత వారిని చూడలేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. అలాగే ఇంటిలోకి ఎవరూ వెళ్లిన దాఖలాలు కూడా కనిపించకపోవడంతో మిస్టరీ మరణాలుగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.






