- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Colonel Sophia Qureshi : కల్నల్ సోఫియాపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదుకు హైకోర్ట్ ఆదేశం
మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కున్వర్ విజయ్ షా(Minister Kunwar Vijay Shah), భారత సైన్యంలో కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sophia Qureshi)పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కున్వర్ విజయ్ షా(Minister Kunwar Vijay Shah), భారత సైన్యంలో కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sophia Qureshi)పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. గత సోమవారం మంత్రి విజయ్ షా.. ఇండోర్ సమీపంలోని రామ్‌కుండలో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) గురించి మాట్లాడుతూ ఖురేషీని "ఉగ్రవాదుల సోదరి"(Terrorists Behenji) అని వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాటలు వైరల్ కావడంతో కాంగ్రెస్, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు విజయ్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కాగా ఈ వ్యవహారాన్ని నేడు మధ్యప్రదేశ్ హైకోర్టు(MP High Court)(జబల్పూర్ బెంచ్) సుమోటోగా స్వీకరించింది. మంత్రిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి ఆదేశించింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి విజయ్ షా.. తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని, సోఫియాను గౌరవిస్తానని, క్షమాపణ చెబుతానని బుధవారం వివరణ ఇచ్చారు. అలాగే ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ విజయ్ షాను హెచ్చరించినట్లు సమాచారం.






