- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌తో గూఢచర్యం..మాజీ మంత్రి పీఏ అరెస్ట్
భారత్‌లో ఉంటూ కొంతమంది పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు దేశద్రోహులు పట్టుబడగా వారిని అధికారులు విచారిస్తున్నారు.

దిశ వెబ్ డెస్క్: భారత్‌లో ఉంటూ కొంతమంది పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు దేశద్రోహులు పట్టుబడగా వారిని అధికారులు విచారిస్తున్నారు. కాగా తాజాగా మరో గూఢచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి మరియు ఓ రాజకీయ పార్టీ నేత మాజీ పీఏ సకూర్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్టు ఇంటిలిజెన్స్ అధికారులు వెల్లడించారు. అతడు ఆరేడుసార్లు పాకిస్థాన్ వెళ్లి వచ్చాడని తెలిపారు. అధికారులు సకూర్ ఖాన్ మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా అందులో పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ నంబర్ల గురించి సకూర్ ఖాన్ సరైన సమాధానాలు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఖాన్ ఫోన్‌లో సైనిక రహస్య సమాచారం లభించనప్పటికీ కొన్ని ఫైళ్లను డిలీట్ చేసినట్టు అధికారులు తెలిపారు. అతడికి సంబంధించిన బ్యాంకు ఖాతాలపై కూడా అధికారులు దృష్టి సారించారు.






