జోడువాగు జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి: మంత్రి వివేక్​వెంకటస్వామి

by Ajay Maddhiboyina |

జోడువాగు రోడ్ జాతీయ రహదారి-63 పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి

జోడువాగు జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి: మంత్రి వివేక్​వెంకటస్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో : జోడువాగు రోడ్ జాతీయ రహదారి-63 పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామని కోరారు. బుధవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ ని కలిసి, తెలంగాణలోని ప్రధాన రహదారి ప్రాజెక్టుల గురించి వివరించారు. జోడువాగు రహదారి అభివృద్ధి పనులు ఆలస్యం కావడం, ఎన్​హెచ్​-63 రహదారి నిర్మాణం ఏడాది దాటినా ఇంకా డీపీఆర్ దశలోనే ఉండిపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నయని చెప్పారు.

అదే విధంగా ఆ ప్రాంత అభివృద్ధి ఆలస్యం, ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిస్తున్నాయని తెలిపారు. ఈ అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే డీపీఆర్​ఆమోదం, పనుల ప్రారంభంపై తాను స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణకు మంచి కనెక్టివిటీ, అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల బాగు కోసం తాము కట్టుబడి ఉన్నామని, పనులు ప్రారంభమయ్యే వరకు పట్టువదమని ఎంపీ వంశీకృష్ణ చెప్పారు.

Next Story