- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్ ఎలక్షన్ రిజల్ట్స్.. ఇది న-ని మ్యాజిక్ : మంత్రి లోకేశ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. 243 స్థానాలకు గాను ప్రస్తుతం 201 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. ఎన్డీయే విజయం తథ్యమని బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. బిహార్ లో ఎన్డీయే కూటమి విజయంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బిహార్ సీఎం నితీశ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎక్స్(x)లో పోస్ట్ పెట్టారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయం.. న-ని (నరేంద్ర మోద - నితీశ్ కుమార్)ల మ్యాజిక్కే ఇందుకు కారణమని కొనియాడారు. ప్రధాని దార్శనిక నాయకత్వం, నితీశ్ కుమార్ విశ్వసనీయ పాలనపై ప్రజలు ఉంచిన బలమైన నమ్మకానికి ఈ తీర్పు నిదర్శనమని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించనున్న బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీల నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story






