మహిళలు అలాంటి బట్టలు వేసుకుంటేనే నాకిష్టం..బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

పొట్టి బట్టలు వేసుకునే మహిళలు, అమ్మాయిలు తనకు నచ్చరు అని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గియా అన్నారు. బోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మహిళలు అలాంటి బట్టలు వేసుకుంటేనే నాకిష్టం..బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పొట్టి బట్టలు వేసుకునే మహిళలు, అమ్మాయిలు తనకు నచ్చరు అని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గియా అన్నారు. బోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాశ్చాత్య దేశాల్లో పొట్టి బట్టులు వేసుకుంటే ఫ్యాషన్ అని కానీ మన దేశంలో సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే మహిళలకు అందంగా ఉంటారని అన్నారు.

తక్కవ దుస్తులు ధరించే స్త్రీలు రాజకీయాల్లో ఉండి తక్కువగా మాట్లాడే రాజకీయనాయకుల లాంటి వారు అని చెప్పారు. ఇద్దరిలోనూ మ్యాటర్ ఉండదని అన్నారు. తాను స్త్రీలను దేవతలుగా చూస్తానని, వారు మంచి దుస్తులు ధరించాలని అన్నారు. పొట్టిగా శరీరం కనిపించేలా దుస్తులు ధరించిన అమ్మాయిలు, మహిళలు అంటే తనకు ఇష్టం ఉండదని చెప్పారు. అలాంటి వారితో నేను ఫోటోలు కూడా దిగను అని స్పష్టం చేశారు. ఇక మహిళ దుస్తులపై కామెంట్లు చేయడంతో మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Next Story