- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో మెట్రో పనుల ఆలస్యంపై ఓ మంత్రి అధికారులపై మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని నాగరవార-బాగలూరు క్రాస్ మెట్రో ఫేజ్-2బీ పనుల పరిశీలనలో కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ భైరే గౌడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పిల్లర్లు పూర్తి కాకపోవడం, ఏడాదిగా రోడ్లు మూసివేయడంపై మెట్రో అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆయన నిలదీశారు. పనుల ఆలస్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవసరం లేని రోడ్డు బారికేడ్లను తొలగించాలని, చెత్తను వెంటనే శుభ్రం చేయాలని, పనులు వేగంగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తూ, జవాబుదారీతనంతో సమన్వయంగా పనులు పూర్తిచేయాలని వారికి సూచించారు. ఈ ఘటనపై నెటిజన్‌లు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి మంత్రులు మనకు కావాల్సిందని పలువురు నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు. వీడియో ఇదే..






