మంత్రికి అవమానం.. దుమారం రేపుతున్న వీడియో

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ఏకే శర్మ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. వృందావన్‌లోని బంకే బిహారీ ఆలయానికి వెళ్లిన ఆయనను.. ఆలయ సేవకులు (సేవాయత్‌లు), గోస్వామీ సమాజ సభ్యులు ముఖ్యంగా మహిళలు దర్శనం చేసుకోకుండా అడ్డుకున్నారు. దేవతా విగ్రహం ముందు తెర

మంత్రికి అవమానం.. దుమారం రేపుతున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ఏకే శర్మ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. వృందావన్‌లోని బంకే బిహారీ ఆలయానికి వెళ్లిన ఆయనను.. ఆలయ సేవకులు (సేవాయత్‌లు), గోస్వామీ సమాజ సభ్యులు ముఖ్యంగా మహిళలు దర్శనం చేసుకోకుండా అడ్డుకున్నారు. దేవతా విగ్రహం ముందు తెర వేసిన వారు.. సాంప్రదాయ శాలువా (పట్కా) ఇవ్వలేదు. కనీసం ప్రసాదం కూడా అందించలేదు. ఈ నిరసనలు రూ. 600 కోట్ల బంకే బిహారీ ఆలయ కారిడార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ప్రాజెక్టు వృందావన్ యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీస్తుందని.. 250కి పైగా భవనాలను కూల్చివేసి.. కుటుంబాలు, వ్యాపారులకు అన్యాయం చేస్తుందని భయపడుతున్నారు.

2022లో జరిగిన తొక్కిసలాట సంఘటనను సూచిస్తూ... సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. యాత్రికుల భద్రత, గుండెడ్ నిర్వహణ కోసం ఆలయ నిధులతో ఐదు ఎకరాల భూమిని సేకరించడానికి అనుమతించింది. ఆలయం నుండి బయటకు వెళ్లిన తర్వాత.. శర్మ జుగల్ గోస్వామీ నివాసంలో నిరసనకారులతో సమావేశమై.. ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందని.. స్థానిక భావనలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మంత్రి.

VIDEO

Next Story