- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AIMIM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎంట్రీ..!
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే (AIMIM) ఎంఐఎం పార్టీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ అల్లర్ల నిందితుడు తాహీర్ హుస్సేన్‌ను ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. నేడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని తాహిర్ హుస్సేన్ కుటుంబం కలవనున్నట్లు తెలిసింది.
ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్.. తాహిర్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 16 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్క స్థానంలో విజయం నమోదు చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025 పిబ్రవరితో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.






