- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ ఎన్నికల్లో MIM పార్టీ తనదైన ముద్ర.. 25 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ.. గెలిచిన స్థానాలు ఇవే!
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) తమదైన ముద్ర వేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Bihar elections)బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయాన్ని సాధిస్తున్న వేళ, అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) తమదైన ముద్ర వేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో గట్టి పోటీని నమోదు చేసి, ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయాలను ఖాతాలో వేసుకుంది. జోకిహట్, బహదుర్‌గంజ్, కొఛాధమన్, అమౌర్, బైసీ నియోజకవర్గాల్లో ఏఐఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఐదు స్థానాల్లో కూడా పార్టీ అభ్యర్థులు గణనీయమైన మెజారిటీలతో గెలవడం విశేషం. మొత్తం ఓట్ల పరంగా కూడా పార్టీకి మంచి స్పందన లభించింది.
బీహార్‌లో ప్రధాన కూటములైన ఎన్డీఏ–మహాగఠబంధన్‌ల మధ్య కీలక పోరు నడుస్తున్న నేపథ్యంలో, మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో ఏఐఎంఐఎం ప్రభావం మరింత పెరుగుతోందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ విజయాలు పార్టీకి భవిష్యత్తులో బీహార్ రాజకీయాల్లో మరింత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలో తన అడుగులను బలోపేతం చేసుకునే అవకాశాలను తెరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కంటే ఎంఐఎం మంచి ప్రదర్శన ఇచ్చిందని రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.
ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం పార్టీ బీహార్ నేత వారిస్ పఠాన్ మాట్లాడుతూ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం భారీ ప్రోత్సాహం అని పేర్కొన్నారు. ఆయన ఏడు నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనారిటీ ఓట్ల విభజనకు ఆర్జేడీ, కాంగ్రెస్ వారే బాధ్యత వహించాలన్నారు, ఎందుకంటే మహాగఠబంధన్ నుండి ఆరు సీట్లు మాత్రమే మేము కోరాము.. కానీ వారు నిరాకరించారు.. అని అన్నారు. మొదట మహారాష్ట్ర , ఇప్పుడు బీహార్‌లో వారు మమ్మల్ని బీ టీమ్ అని పిలిచి ఓటమి, అవమానాన్ని ఎదుర్కొన్నారని పఠాన్ మండిపడ్డారు.
గెలిచిన స్థానాలు ఇవే..






