- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microsoft AI: 12 నెలల్లో మెజార్టీ వైట్ కాలర్ జాబ్‌లను రీప్లేస్ చేయనున్న ఏఐ
ఏఐ ఉద్యోగ మార్కెట్‌ను, ముఖ్యంగా వైట్-కాలర్ ఉద్యోగాలను ఆక్రమిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పురోగతికి సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యోగాలను అది ఎలా ఆక్రమిస్తుందనే విషయంపై ఇటీవల కీలక ప్రకటన చేసిన తర్వాత ముస్తఫా మరోసారి వార్తల్లో నిలిచారు. ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏఐ ఉద్యోగ మార్కెట్‌ను, ముఖ్యంగా వైట్-కాలర్ ఉద్యోగాలను ఆక్రమిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా న్యాయ వ్యవస్థలో అనేక పనులు ఆటోమేట్ అవుతాయని, అకౌంటింగ్ నుంచి మార్కెటింగ్, ప్రాజెక్ట్ నిర్వహణ వరకు అనేక రంగాల్లో ఉద్యోగాలను ఏఐ మోడల్ చేయనుంది. చాలావరకు రోజువారీ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తుంది. ఇది రాబోయే 12-18 నెలల్లోనే జరగనుందని పేర్కొన్నారు. రాబోయే ఏఐ వ్యవస్థలు మనుషులు చేసే చాలావరకు ప్రొఫెషనల్ పనులను చేయగలవని, ముఖ్యంగా నివేదికలను రూపొందించడం, డేటా విశ్లేషణ, కాంట్రాక్టుల పరిశీలన, ప్రాజెక్టులను అమలు చేయడం, మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించడం వంటి పనులను చేయగలవు. ఇది కేవలం హైప్ మాత్రమే కాదు, అనేక కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు, తక్కువ సమయంలో పనులు పూర్తి చేసేందుకు ఏఐ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయని ముస్తఫా సులేమాన్ వెల్లడించారు.






