- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mgnregs: ఉపాధి హామీ పథకం..రెండేళ్లలో భారీగా జాబ్ కార్డుల తొలగింపు!
2022-24లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి 1.55 కోట్లకు పైగా కార్మికుల పేర్లు తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: 2022-24 మధ్య కాలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నుంచి 1.55 కోట్లకు పైగా కార్మికుల పేర్లు తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం మంళవారం పార్లమెంటుకు తెలిపింది. లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2022-23లో 86,17,887 మంది, 2023-24లో 68,86,532 మంది పేర్లను తొలగించినట్టు తెలిపారు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 1,55,04,419 మందిని తొలగించామని పేర్కొన్నారు. నకీలి, తప్పు జాబ్ కార్డులు, పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టి పోవడం, వారి గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాలతో వాటిని తీసివేసినట్టు స్పష్టం చేశారు.
ఈ పథకం అమలు బాధ్యత సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఉందని తెలిపారు. జాబ్ కార్డులను అప్ డేట్ చేయడం, తొలగించడం అనేది రాష్ట్రాలు నిర్వహించే ఒక సాధారణ ప్రక్రియ అని వెల్లడించారు. అయితే జాబ్ కార్డులను తొలగించేటప్పుడు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన కుటుంబాల జాబ్ కార్డులు రద్దు చేయలేమని తెలిపారు. మొత్తం 13.41 కోట్ల మంది కార్మికులలో 13.34 కోట్ల మంది ఆధార్ సీడింగ్ ఫిబ్రవరి 1 నాటికి పూర్తయిందని పేర్కొన్నారు. జాబ్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గతనెల జనవరి 25న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జారీ చేసిందని తెలిపారు.






