- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా బాటలోనే మెక్సికో.. భారత్‌పై సుంకాల మోతకు రంగం సిద్ధం!
రష్యా (Russia) నుంచి ముడి చమురు కొనుగోళ్ల వేళ అగ్రదేశం అమెరికా (America) భారత్‌పై అదనపు సుంకాలు వేస్తూ ప్రతికారం తీర్చుకుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: రష్యా (Russia) నుంచి ముడి చమురు కొనుగోళ్ల వేళ అగ్రదేశం అమెరికా (America) భారత్‌పై అదనపు సుంకాలు వేస్తూ ప్రతికారం తీర్చుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మెక్సికో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించేందుకు రంగం సిద్ధం చేసింది. తాజా నిర్ణయంతో భారత్‌పై టారీఫ్‌ల భారం పడనుంది. ఈ మేరకు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పార్డో సెప్టెంబర్‌లో ప్రతిపాదించిన బిల్లుకు మెక్సికో సెనేట్ డిసెంబర్ 10న ఆమోదం తెలిపింది. దీంతో 2026 జనవరి 1 నుంచి సుమారు 1,400 నుంచి 1,463 రకాల వస్తువులపై 5 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు పెరగనున్నాయి. మెజారిటీ వస్తువులపై 35 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది.
కాగా, తాజా పరిణామంతో దేశంలోని ఆటోమొబైల్స్, ఆటో పార్ట్స్, టెక్స్‌టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్స్, స్టీల్, అల్యూమినియం, ఫుట్‌వేర్, ఫర్నిచర్, టాయ్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలపై తీవ్రంగా ప్రభావం పడనుంది. మెక్సికో ప్రభుత్వ నిర్ణయంతో భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతులపై సుంకాల మోత మోగనుంది. అదేవిధంగా అమెరికా, కెనడా వంటి దేశాలకు మినహాయింపును ఇచ్చారు.






