- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mexico: మెక్సికోలో జెన్ జీ నిరసనలు.. అధ్యక్ష భవనం ముట్టడితో తీవ్ర ఉద్రిక్తత
నార్త్ అమెరికా దేశమైన మెక్సికోలోనూ జెన్ జీ నిరసనలు వెల్లువెత్తాయి. నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

దిశ, నేషనల్ బ్యూరో: నార్త్ అమెరికా దేశమైన మెక్సికోలోనూ జెన్ జీ నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలో జరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది జెన్ జీ యువకులు ఆందోళన చేపట్టారు. మెక్సికో నగర వీధుల్లోకి భారీగా వచ్చి నిరసన తెలిపారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్ బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ అధికారిక భవనమైన నేషనల్ ప్యాలెస్‌ను ముట్టడించారు. ప్యాలెస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసన కారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళన కారులు పోలీసులపైకి దాడికి పాల్పడటంతో వారిని చెదరగొట్టేందుకు సెక్యురిటీ సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో 100 మంది పోలీసులతో సహా 120 మంది గాయపడ్డట్టు మెక్సికో సిటీ పబ్లిక్ సేఫ్టీ సెక్రటరీ పాబ్లో వాజ్క్వెజ్ తెలిపారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ధ్రువీకరించారు.
మేయర్ హత్యతో పెల్లుబికిన ఆగ్రహం
ఈ నెల 1న పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన మిచోకాన్‌లోని ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజోను హత్య చేశారు. ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగానే ఆయనను కాల్చి చంపారు. దీంతో అప్పటి నుంచి నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం వాటిని అణచివేసేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో జెన్ జీ యువకులు నిరసనలు చేపట్టారు. హింసను అరికట్టడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్లోస్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాలే యువకులను రెచ్చగొడుతున్నాయని ప్రెసిడెంట్ షీన్ బామ్ ఆరోపించారు.






