- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mexican Navy ship: న్యూయార్క్ లో పడవ ప్రమాదం.. ఇద్దరు మృతి
న్యూయార్క్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. న్యూయార్క్ లోన బ్రూక్లిన్ వంతెనను మెక్సికన్ నేవీ షిప్ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: న్యూయార్క్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. న్యూయార్క్ లోన బ్రూక్లిన్ వంతెనను మెక్సికన్ నేవీ షిప్ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయయి. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో నౌకలో 277 మంది ఉన్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని చెప్పుకొచ్చారు. పడవ నుంచి అందర్నీ ఒడ్డుకు చేర్చినట్లు వెల్లడించారు. మరోవైపు, పడవ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారింది. క్యాడెట్ శిక్షణనౌక న్యూయార్క్ హార్బర్ నుండి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8:26 గంటల ప్రాంతంలో పడవ పైభాగంలో అనేక మంది నావికులు వేచి ఉన్నారు. అలాంటి టైంలో షిప్ మాస్క్ లు వంతెనను ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే న్యూయార్క్ అగ్నిమాపక విభాగం సహాయక చర్యలు చేపట్టింది. మరోవైపు, కువాటెమోక్ అనేది మెక్సికన్ నేవీ శిక్షణ నౌక. ఇది 15 దేశాల్లోని 22 ఓడరేవులను సందర్శించాల్సి ఉంది.






