- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్సీ కోల్‌కతా ఘటన.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్: వెస్ట్ బెంగాల్ డీజీపీ
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‍కతా పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) కోల్‍కతా పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈవెంట్‌లో నిర్వహణ వైఫల్యం, మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురై స్టేడియంలోకి విధ్వంసం సృష్టించారు. దీనిపై ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈవెంట్ ఆర్గనైజర్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మెస్సీ ఆడకపోవడం అభిమానుల ఆగ్రహానికి కారణం అని స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వహణ లోపం కనిపిస్తోందని అన్నారు. టికెట్ డబ్బులు వాపస్ ఇస్తామని ఆర్గనైజర్స్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని, ఈ మేరకు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్టేడియం వద్ద పరిస్థితి కంట్రోల్‌లోకి ఉందని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.






