Court: రాత్రిపూట మహిళకు మెస్సేజీలు చేస్తే అది అసభ్యతే.. ముంబై కోర్టు కీలక తీర్పు

by Shamantha N |

“మీరు స్లిమ్‌గా ఉన్నారు.. స్మార్ట్‌గా ఉన్నారు.. మీకు పెళ్లైందా?” వంటి మెసేజీలు రాత్రిపూట పరిచయం మహిళలకు చేస్తే అసభ్యతే అవుతోందని ముంబై సెషన్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది.

Court: రాత్రిపూట మహిళకు మెస్సేజీలు చేస్తే అది అసభ్యతే.. ముంబై కోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: “మీరు స్లిమ్‌గా ఉన్నారు.. స్మార్ట్‌గా ఉన్నారు.. మీకు పెళ్లైందా?” వంటి మెసేజీలు రాత్రిపూట పరిచయం మహిళలకు చేస్తే అసభ్యతే అవుతోందని ముంబై సెషన్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. అతడికి ట్రయల్ కోర్టు విధించిన మూడ్నేళ్ల శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ముంబైకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. ‘‘మీరంటే ఇష్టం, మీరు చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు వివాహం అయ్యిందా? లేదా?, మీరు సన్నగా ఉన్నారు!!..’’ అంటూ.. తెలియని మహిళలకు అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదంది. ఈ చర్య అశ్లీలత(Obscene) కిందకే వస్తుందని తెలిపింది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరని కోర్టు పేర్కొంది. ప్రత్యేకించి.. ఒకరికొరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి డీజీ ధోబ్లే వ్యాఖ్యానించారు.

మూడ్నెళ్ల శిక్ష..

అయితే, రాజకీయ వైరంతోనే మహిళ తనపై తప్పుడు కేసు పెట్టిందన్న వ్యక్తి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఏ మహిళ కూడా తప్పుడు కేసుతో తన పరువుని పణంగా పెట్టదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్‌ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్‌ రుజువు చేసిందని కోర్టు వెల్లడించింది. అందుకే, అతడు ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్స్‌ కోర్టు స్పష్టం చేసింది. ఇకపోతే, 2016 జనవరిలో మాజీ కార్పొరేటర్ కు ఓ వ్యక్తి అసభ్య వాట్సప్ సందేశాలు పంపాడు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అతడ్ని అరెస్టు చేశారు. ఆరేళ్ల తర్వాత మేజిస్ట్రేట్ కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. మూడ్నెళ్ల శిక్ష విధించింది. అయితే, ఈ శిక్షను సవాల్ చేస్తూ అతడు సెషన్ కోర్టుని ఆశ్రయించాడు. కాగా.. ట్రయల్ కోర్టు తీర్పుని సెషన్ కోర్టు సమర్థించింది.

Next Story