- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: సీఐసీ నియామకంపై భేటీ.. మోడీతో విభేదించిన రాహుల్ గాంధీ!
కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ వంటి పారదర్శక సంస్థలకు నియామకాలను ఖరారు చేయడానికి ఇవాళ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం ముగిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ వంటి పారదర్శక సంస్థలకు నియామకాలను ఖరారు చేయడానికి ఇవాళ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం ముగిసింది. ప్రధాని మోడీ (Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) పాటు లోక్‍సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఐసీ ఎంపికపై దాదాపు 90 నిమిషాల పాటు ఈ ముగ్గురు చర్చించారు. సమావేశం అనంతరం అత్యున్నత పదవులకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్ల విషయంలో మోడీతో రాహుల్ గాంధీ విభేదించినట్లు వర్గాలు తెలిపారు. ఈ మేరకు లిఖితపూర్వక అసమ్మతి నోట్‌ను రాహుల్ గాంధీ అందజేశారు. అయితే సెంట్రల్ ప్యానళ్ల చీఫ్‌ల ఎంపికలో షార్ట్‌లిస్ట్ చేసిన అధికారులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.
కాగా, సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ బుధవారం సమావేశమవుతుందని కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి.






