- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New Pope: కొత్త పోప్ ఎన్నిక.. కార్డినల్స్ లో నలుగురు భారతీయులు
క్యాథలిక్ క్రైస్తవుల అధినేత పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ మృతి నేపథ్యంలో వాటికన్‌లో తొమ్మిది రోజుల పాటు అధికారికంగా సంతాప దినాలు పాటించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: క్యాథలిక్ క్రైస్తవుల అధినేత పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ మృతి నేపథ్యంలో వాటికన్‌లో తొమ్మిది రోజుల పాటు అధికారికంగా సంతాప దినాలు పాటించనున్నారు. ఈ సంతాప దినాలు ముగిసిన వెంటనే, కొత్త పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హులైన కార్డినల్స్ 'కాంక్లేవ్'గా పిలిచే ప్రత్యేక సమావేశంలో పాల్గొని తదుపరి పోప్‌ను ఎన్నుకుంటారు. అయితే, ఈ అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే నిశ్శబ్దంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోప్ ఎన్నికలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన కార్డినల్స్ సంఖ్య 135గా ఉంది. కాగా.. ఇందులో నలుగురు భారతీయులు ఉండటం విశేషం.
నలుగురు భారతీయులు
కొత్త పోప్ ఎన్నికలో నలుగురు భారతీయ కార్డినల్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గోవా, డామన్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రావ్ (72), హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోనీ పూల (63), తిరువనంతపురం మేజర్ ఆర్చ్ బిషప్ కార్డినల్ బసేలియోస్ క్లీమిస్ తొట్టుంకల్(64), వాటికన్‌లోని మతాంతర సంప్రదింపుల విభాగం ప్రిఫెక్ట్‌గా పనిచేస్తున్న కార్డినల్ జార్జ్ జాకబ్ కూవక్కాడ్ (51) ఈ నలుగురిలో ఉన్నారు. భారత క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా కార్డినల్ ఫెర్రావ్, సిరో-మలంకర చర్చి సైనాడ్ అధ్యక్షుడిగా కార్డినల్ క్లీమిస్ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.






