బిజినెస్ మీటింగ్ ఉంది మాట్లాడుకుందాం రా అని పిలిచి మహిళా వ్యాపార వేత్తపై కంపెనీ ఎండీ దారుణం

by Prasad Jukanti |

తుపాకీతో బెదిరించి ఓ మహిళా వ్యాపార వేత్తను మరో కంపెనీ ఎండీ బెదిరించినట్లు ఫిర్యాదు రావడం కలకలం రేపుతోంది.

బిజినెస్ మీటింగ్ ఉంది మాట్లాడుకుందాం రా అని పిలిచి మహిళా వ్యాపార వేత్తపై కంపెనీ ఎండీ దారుణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకునేందుకు మీటింగ్ ఉంది రావాలని పిలిపించి ఓ ప్రైవేటు కంపెనీ ఎండీ మహిళా వ్యాపారవేత్తపై దారుణంగా వ్యవహరించాడు. తూపాకీతో బెదిరించి ఆమెను నగ్నంగా మార్చి ఫోటోలు, వీడియోలు చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతానని బెదిరించాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్, గిఫ్ట్స్ బిజినెస్ నిర్వహిస్తునన ఓ మహిళ వ్యాపారవేత్త(51)ను మీటింగ్ ఉంది రావాలని ఓ ఫార్మాన్యూటికల్స్ ఎండీ ఇటీవల తన ఆఫీస్‍కు పిలిపించారు. ఇదంతా నిజమే అని నమ్మిన సదరు మహిళా వ్యాపారవేత్త అతడి ఆఫీసుకు వెళ్లాక అక్కడ జరిగింది చూసి షాక్ కు గురైంది. ఆఫీసులో పలికి వెళ్లాక అక్కడ మిగతా సిబ్బందితో కలిసి ఆమెపై తుపాకీ పెట్టి దుస్తువులు తీసివేయాలని బెదిరించారు. ఆమెను నగ్నంగా మార్చి ఆ ఫోటోలు రికార్డు చేశారు. అయితే అక్కడి నుంచి బయట పడిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంస్థ ఎండీతో పాటు మరో ఐదుగురిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story