మెక్‌డొనాల్డ్స్‌లో దారుణం.. మేనేజర్‌ను హత్య చేసిన ఉద్యోగి

by Sujitha Rachapalli |

మిచిగాన్‌లోని ఈస్ట్‌పాయింట్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌లో దారుణ సంఘటన జరిగింది. 26 ఏళ్ల ఉద్యోగి అఫెని ముహమ్మద్.. తన మేనేజర్ జెన్నిఫర్ హారిస్‌ను కత్తితో పొడిచి చంపింది. ఈ సంఘటనకు ముందు హారిస్, ముహమ్మద్ మధ్య పని విషయంలో వివాదం జరిగింది

మెక్‌డొనాల్డ్స్‌లో దారుణం.. మేనేజర్‌ను హత్య చేసిన ఉద్యోగి
X

దిశ, వెబ్ డెస్క్: మిచిగాన్‌లోని ఈస్ట్‌పాయింట్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌లో దారుణ సంఘటన జరిగింది. 26 ఏళ్ల ఉద్యోగి అఫెని ముహమ్మద్.. తన మేనేజర్ జెన్నిఫర్ హారిస్‌ను కత్తితో పొడిచి చంపింది. ఈ సంఘటనకు ముందు హారిస్, ముహమ్మద్ మధ్య పని విషయంలో వివాదం జరిగింది. హారిస్.. ముహమ్మద్‌ను విధులు సరిగా నిర్వర్తించలేదని ఇంటికి పంపింది. కానీ కాసేపు అయ్యాక ముహమ్మద్ మాస్క్ ధరించి తిరిగి వచ్చి.. కిచెన్‌లో ఉన్న కత్తితో హారిస్‌ను 15 సార్లు పొడిచింది. ఈ టైంలో ఒక కస్టమర్.. లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాలిలో కాల్పులు జరిపి.. పోలీసులు వచ్చేవరకు ముహమ్మద్‌ను హెచ్చరిస్తూ కంట్రోల్ చేశాడు. హారిస్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాలతో మరణించింది.

ముహమ్మద్‌ను అరెస్ట్ చేసి.. ఈస్ట్‌పాయింట్‌లోని 38వ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచారు. హత్య, చట్టవిరుద్ధమైన ఆయుధం కలిగి ఉండటాన్ని నేరంగా పరిగణించింది కోర్టు. కాగా 2022లో వర్జీనియాలో జరిగిన మరో కత్తిపోటు సంఘటనలో ముహమ్మద్‌ దోషిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story