కోటి రూపాలయతో బెంజ్ కారు కొన్న చాయ్ వాలా.. ఎక్కడో తెలుసా?

by Dishafeatures2 |
కోటి రూపాలయతో బెంజ్ కారు కొన్న చాయ్ వాలా.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఓ చాయ్ వాలా కోటి రూపాయల కారు కొన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. గుజరాత్ లోని అహమ్మదాబాద్ కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల MBA కోర్సును మధ్యలోనే ఆపేశాడు. ఈ క్రమంలోనే 2017లో కుటుంబం కోసం ఓ చిన్న టీ స్టాల్ పెట్టాడు. ప్రఫుల్ ఎంతో కష్టపడి తన చాయ్ బిజినెస్ ను డెవలప్ చేశాడు. అనంతరం MBA చాయ్ వాలా పేరుతో దేశంలోని పలు చోట్ల ఫ్రాంచైజీలు ప్రారంభించాడు. అలా ఆయన బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా దినదినాభివృద్ధి చెందింది. కాగా తాజాగా ఈ MBA చాయ్ వాలా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంజ్ కార్ల షో రూంకి వెళ్లాడు.

అక్కడ తనకు నచ్చిన మెర్సిడెస్ లక్జరీ ఎస్యూవీ ( Mercedes luxury SUV) బెంజ్ కారును కోటి రూపాయలు పెట్టి కొన్నాడు. తర్వాత ప్రఫుల్ తన అమ్మనాన్నలు, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కొత్తగా కొన్న కారులో ఎంచక్కా అహ్మదాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టాడు. అనంతరం ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రఫుల్ సక్సెస్ స్టోరీని చూసిన నెటిజన్లు 'వాట్ ఏ జర్నీ' అంటూ తెగ పొగిడేస్తున్నారు.

Next Story