విపక్షాలు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయ్.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై మాయావతి

by Disha Web Desk 13 |
విపక్షాలు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయ్.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై మాయావతి
X

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నానని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. పార్లమెంట్ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది కాబట్టి.. దాన్ని ప్రారంభించే హక్కు దానికే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విపక్ష పార్టీలు బహిష్కరించడం అన్యాయమని ఆమె కామెంట్ చేశారు. ఈమేరకు మాయావతి గురువారం వరుస ట్వీట్లు చేశారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా.. బీఎస్పీ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంటును ప్రారంభించనందుకు.. భవన ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బహిష్కరించడం అన్యాయమన్నారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని గిరిజన మహిళల గౌరవంతో ముడిపెట్టడం సరికాదన్నారు. ద్రౌపది ముర్మును ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశం ఉన్నా.. ఆమెకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టేటప్పుడు ఈ విషయాన్ని ఆ పార్టీలు ఆలోచించి ఉండాల్సిందన్నారు. తనకు ఆహ్వానం అందినప్పటికీ.. పార్టీపరమైన కొన్ని ప్రోగ్రామ్స్ కారణంగా మే 28న జరిగే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని మాయావతి వెల్లడించారు.


Next Story

Most Viewed