- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకాష్ ఆనంద్‌కు బీఎస్పీ కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి
ఆకాష్ ఆనంద్‌కు బీఎస్పీ కీలక బాధ్యతలు అప్పగించారు మాయావతి. అతన్ని పార్టీ జాతీయ చీఫ్ కోఆర్డినేటర్‌గా నియమించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మరోసారి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు కీలక పదవి కట్టబెట్టింది. మార్చి నెలలో అతన్ని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఏప్రిల్ నెలలో ఆకాష్‌ను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు అతన్ని పార్టీ జాతీయ చీఫ్ కోఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలన్నీ ఆకాష్ చేతుల్లోనే పెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈసారి తన మేనల్లుడు ఆకాష్ సరైన నిర్ణయాలు తీసుకొని పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు మరింత బలం చేకూరుస్తాడని తాను నమ్ముతున్నట్లు మాయావతి పేర్కొన్నారు. ఆకాష్‌తోపాటుగా రామ్ జీ గౌతమ్, రణధీర్ బెనివాల్, రాజారామ్‌లను జాతీయ కోఆర్డినేటర్లను బీఎస్పీ నియమించినట్లు తెలుస్తోంది.






