- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mauritius: రేపు మారిషస్‌కు ప్రధాని మోడీ.. రెండు రోజుల పాటు పర్యటన
ప్రధాని మోడీ మారిషస్ పర్యటనకు వెళ్లనున్నారు. 58వ నేషనల్ డే కార్యక్రమానికి హాజర్వడంతో పాటు ప్రతినిధులతో భేటీ కానున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) మంగళవారం మారిషస్ (Mauritius) పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు పర్యటన కొనసాగనుండగా మారిషస్ 58వ నేషనల్ డే కార్యక్రమానికి హాజర్వడంతో పాటు పలువురు ప్రతినిధులతో భేటీ కానున్నారు. అంతేగాక భారత్ (India), మారిషస్ ఆర్థిక, భద్రతా సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు అనేక ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సముద్ర భద్రత, ఆర్థిక నేరాల నియంత్రణ వంటి వాటిపై కూడా డిస్కస్ చేయనున్నట్టు పేర్కొంది. ప్రధాని మోడీ మారిషస్ పర్యటపై ఆ దేశ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం (Ram gulam) మాట్లాడుతూ ‘చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మారిషస్‌కు ఈ గౌరవాన్ని ఇస్తున్న విశిష్ట వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం తమ దేశానికి ఒక ప్రత్యేకమైన గౌరవం. మోడీ పర్యటన రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు నిదర్శనం’ అని తెలిపారు.
కాగా, పశ్చిమ హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశమైన మారిషస్‌తో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ దేశ జనాభాలో 70 శాతం మంది భారత సంతతి వ్యక్తులే ఉండడం గమనార్హం. అందుకే మారిషస్‌ను మినీ ఇండియా (Mini india)గా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు దీపావళి, హోలీ, ఇతర భారతీయ పండుగలను ఉత్సాహంతో జరుపుకుంటారు. గత దశాబ్దంలో ఇరుపక్షాల మధ్య సముద్ర భద్రత, రక్షణ రంగంలో సహకారం గణనీయంగా పెరిగింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం సైతం గత 17 సంవత్సరాలలో 132 శాతం పెరిగింది. 2005-06లో 206 మిలియన్లు ఉండగా.. 2022-23లో 554 మిలియన్లకు చేరింది.






