- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mann Ki Baat: పెహల్గామ్ ఉగ్రదాడిపై మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మన్ కీ బాత్ లో పెహల్గాం ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం 121వ ఎసిపోడ్‌లో మోడీ పెహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మన్ కీ బాత్ లో పెహల్గాం ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం 121వ ఎసిపోడ్‌లో మోడీ పెహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడారు. ఈ దాడి తనను ఎంతగానో కలచి వేసిందని.. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఈ దాడి ముష్కరుల నిరాశ, పిరికితనాన్ని చూపిస్తుందన్నారు. "కశ్మీర్‌లో శాంతి స్థాపన జరుగుతోంది. స్కూల్స్, కాలేజీలు కళకలలాడుతున్నాయి. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుంది. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుదల ఉంది. ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. యువతకు కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. దేశ శత్రువులు, జమ్ముకశ్మీర్ లో ఇవన్నీ జరగటాన్ని ఇష్టపడట్లేదు" అని మోడీ అన్నారు. జమ్ముకశ్మీర్ అద్భుతంగా పురోగతిని సాధించడాన్ని చూసి ఓర్చుకోలేని ఉగ్రవాదులు దానిని దెబ్బతీసేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడాన్ని తట్టుకోలేక అమాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ ను ఉద్దేశించి..
భారత గడ్డపై ఉగ్రవాద చర్యలకు మద్దతిస్తున్న పాకిస్థాన్ ను ఉద్దేశించి మోడీ సంచనలన వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులు, దాని కోసం కుట్ర పన్నిన వారు ఊహించలేని శిక్షను పొందుతారని మోడీ అన్నారు. అంతేకాకుండా, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు. ప్రపంచం మొత్తం భారతదేశంతో ఉందని ప్రధానమంత్రి అన్నారు. "మృతుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ దాడి వెనుక ఉన్నవారికి కఠినమైన శిక్ష పడుతుంది. ఉగ్రవాదులు కశ్మీర్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నారు. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది భారతీయుల ఐక్యత అతిపెద్ద బలం. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక యుద్ధానికి ఆధారం. ఈ సవాలును ఎదుర్కోవడానికి మనం మన ఆదర్శాలను బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మన సంకల్ప శక్తిని చూపించాలి. దేశం ఒకే గొంతులో ఎలా మాట్లాడుతుందో ప్రపంచం మొత్తం గమనిస్తోంది" అని ఆయన అన్నారు.






