రూ.2500 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ మాస్టర్‌మైండ్‌ అరెస్టు

by Muthe.Rajitha |

గత ఏడాది నవంబర్ లో ఢిల్లీలో రూ.2,500 కోట్ల విలువైన 82 కిలోల హై-గ్రేడ్ కొకైన్‌ను నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

రూ.2500 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ మాస్టర్‌మైండ్‌ అరెస్టు
X

దిశ, వెబ్ డెస్క్ : గత ఏడాది నవంబర్ లో ఢిల్లీలో రూ.2,500 కోట్ల విలువైన 82 కిలోల హై-గ్రేడ్ కొకైన్‌ను నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ భారీ స్మగ్లింగ్‌కు మాస్టర్‌మైండ్‌ ను నేడు అరెస్ట్ చేసారు. ఢిల్లీకి చెందిన్స్ హవాలా ఏజెంట్ పవన్ ఠాకూర్ ఈ కేసులో కీలక సూత్రధారిగా తేల్చారు. అయితే పోలీసుల గాలింపు ముమ్మరం కావడంతో కుటుంబంతో దుబాయ్‌కు పారిపోయాడు. కాగా ఇంటర్ పోల్, నార్కోటిక్ అధికారుల సమాచారంతో దుబాయ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

త్వరలోనే అతన్ని భారత్‌కు అప్పగించనున్నారు.. ఇప్పటికే ఈ కేసులో పవన్ అనుచరులు ఐదుగురు అరెస్టయ్యారు. ఈ కేసులో సిండికేట్ ద్వారా రూ.681 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్టు ED గుర్తించింది. గత సెప్టెంబర్ లో నార్కోటిక్ పోలీసులు మొదటిసారిగా ఇంటర్పోల్ "సిల్వర్ నోటీసు" జారీ చేయడంతో పవన్ ఠాకూర్ ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు ట్రాక్ అయ్యాయి. ఈ అరెస్టుతో డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌కు భారీ దెబ్బ పడినట్టు అధికారులు తెలిపారు.

Next Story