కలశయాత్రలో విషాదం.. భారీ తొక్కిసలాట

by Gantepaka Srikanth |

మధ్య ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

కలశయాత్రలో విషాదం.. భారీ తొక్కిసలాట
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్య ప్రదేశ్‌(Madhya Pradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లాలోని దాబ్రా పట్టణంలో మంగళవారం కలశయాత్ర జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట(Stampede) జరిగింది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. మాజీ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం నవగ్రహ పీఠ్ కలశయాత్ర నిర్వహిస్తారు. అందులో భాగంగానే మంగళవారం కలశయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలమంది భక్తులు తరలివచ్చారు. ఊరేగింపు జరుగుతుండగా జనం ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకోవడంతో పరుగులు తీశారు. దీంతో గందరగోళం నెలకొని చాలామంది కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు సీరియస్ అవుతున్నారు. చనిపోయిన మహిళ మృతదేహాన్ని ఆసుపత్రి నుండి నేరుగా కలశయాత్ర జరుగుతున్న ప్రదేశానికి తీసుకువెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు, అధికారులు సర్దిచెప్పారు.

Next Story